లేటెస్ట్ ఫీచర్స్‌తో తిరిగి మార్కెట్లోకి Hero ‘Xtreme 160R’
టూ వీలర్ కంపెనీ హీరో మోటార్స్ తన పాత బైక్‌ను అదనపు హంగులతో తిరిగి మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు ‘Xtreme 160R’.
దిశ, వెబ్‌డెస్క్: టూ వీలర్ కంపెనీ హీరో మోటార్స్ తన పాత బైక్‌ను అదనపు హంగులతో తిరిగి మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు ‘Xtreme 160R’.పాత వెర్షన్ బైక్‌ను లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఇండియాలోకి లాంచ్ చేయాలని చూస్తోంది. దీని ద్వారా తన బైక్ అమ్మకాలను భారీగా పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ బైక్‌ను జూన్ 14న విడుదల చేయనున్నట్లు సమాచారం.
Xtreme 160R అప్‌డేటెడ్ వెర్షన్‌లో అదనంగా USD ఫోర్క్‌ను అందించారు. దీనిలో అప్‌డేట్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఇవ్వనున్నారు. ఇంజన్ పరంగా చిన్న చిన్న మార్పులు వచ్చే అవకాశం ఉంది.163cc ఇంజిన్‌తో, 15 bhp శక్తిని, 14 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇంజన్ హీట్ కాకుండా ఉండటానికి కూలింగ్ టెక్నాలజీని అందించనున్నారు. ధర కూడా రూ. 8,000-10,000 ధర పెరిగే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లతో ఈ బైక్ ధర రూ. 1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.