Hero Passion Plus.. అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి రీ ఎంట్రీ !

హీరో ప్యాషన్​ ప్లస్​మార్కెట్​లోకి మళ్లీ రానుంది. పాత మోడల్లోనే కొత్త ఫీచర్లతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Update: 2023-06-02 05:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: హీరో ప్యాషన్​ ప్లస్​మార్కెట్​లోకి మళ్లీ రానుంది. పాత మోడల్లోనే కొత్త ఫీచర్లతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దేశీయ దిగ్గజ టూవీలర్​ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​.. ప్యాషన్​ ప్లస్​ను తిరిగి ఇండియా మార్కెట్​లో లాంచ్​ చేయనుంది! ఈ నెల్లోనే హీరో ప్యాషన్​ ప్లస్​ 2023 మోడల్​ రోడ్ల మీద దర్శనమిస్తుందని తెలుస్తోంది.

మంచి ఫ్యామిలీ బైక్ ఆదరణ: మంచి మైలేజ్‌తో పాటు ఫ్యామిలీబైక్ పేరుతెచ్చుకున్న హీరో మోడల్‌ బైక్‌లలో ప్యాషన్ ప్లస్ కూడా ఒకటి. 2001లో 'ప్యాషన్​'ను ఇండియాలోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్​. అనేక ఏళ్ల పాటు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఈ మోడల్​ను సంస్థ తయారు చేయడం ఆపడంతో ప్యాషన్​ ప్లస్​కు మాత్రం కాస్త బ్రేక్​ వచ్చింది. . ఇప్పుడు తన పోర్ట్​ఫోలియోను పెంచుకోవాలని చూస్తున్న హీరోమోటో కార్ప్​.. కొత్త కొత్త మోడల్స్​తో పాటు పాత వాటిని తిరిగి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్యాషన్​ ప్లస్​ త్వరలోనే ఇండియాలోకి తిరిగి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

హీరో ప్యాషన్​ ప్లస్ ..లుక్ పరంగా దానికి అదే సాటి: డిజైన్​ పరంగా చూసుకుంటే.. హీరో ప్యాషన్​ ప్లస్​లో స్వల్పంగా అప్​గ్రేడ్స్​ ఉంటాయని తెలుస్తోంది. ఇందులో మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సెమీ- ఫైర్డ్​ హెడ్​ల్యాంప్​ యూనిట్​, స్మాల్​ విండ్​ డిఫ్లెక్టర్​, ఫ్లాట్​ టైప్​ సింగిల్​ పీస్​ సీట్​, వైడ్​ హ్యాండిల్​బార్​, ఓవల్​ షేప్​ మిర్రర్స్​, సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి లభిస్తాయి. బ్లాక్​డ్​ ఔట్​ మల్టీ స్పోక్​ అలాయ్​ వీల్స్​ కూడా కొత్త ప్యాషన్ ప్లస్‌లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ప్యాషన్ ప్లస్ అదిరిపోయే ఇంజన్: ఈ మోడల్​లో 97.2సీసీ, ఎయిర్​ కూల్డ్​, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​, సింగిల్​ సిలిండర్​, బాక్సర్​ టైప్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. ఇటీవల స్ప్లెండర్​ ప్లస్​ మోడల్​లోనూ ఇదే ఉంది. ఈ ఇంజిన్​ 8హెచ్​పీ పవర్​ను, 8ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 4 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

సేఫ్టీలోని రాజీలేదు:ఈ బైక్​ ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్​ ఉండొచ్చు. కంబైండ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ చేర్చనున్నారు. సస్పెషన్స్​ కోసం ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో అడ్జెస్టెబుల్​ డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి ఈ మోడల్లో ఉండే అవకాశం ఉంది.

సరసమైన ధరలోనే ప్యాషన్ ప్లస్: హీరో ప్యాషన్​ ప్లస్​ లాంచ్​ డేట్​తో పాటు ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 75వేలకు పైగా ఉండే అవకాశం ఉంది. 

Also Read..

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా.. అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే! 

Tags:    

Similar News