అమ్మాయిలకు వాట్సాప్‌లో హార్ట్ సింబల్స్ పంపుతున్నారా.. అయితే శిక్ష తప్పదంట

ప్రస్తుతం యువత వాట్సాప్‌లోనే ఎక్కువ గడుపుతూ ఉంటుంది. ఇక తమకు ఇష్టమైన వారికి హార్ట్ ఇమేజ్ పంపడం చాలా కామన్. ముఖ్యంగా బాయిస్ తమకు ఇష్టమైన అమ్మాయిలకు ఎక్కువగా హార్ట్ ఇమేజ్ పంపుతుంటారు.

Update: 2023-08-01 03:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం యువత వాట్సాప్‌లోనే ఎక్కువ గడుపుతూ ఉంటుంది. ఇక తమకు ఇష్టమైన వారికి హార్ట్ ఇమేజ్ పంపడం చాలా కామన్. ముఖ్యంగా బాయిస్ తమకు ఇష్టమైన అమ్మాయిలకు ఎక్కువగా హార్ట్ ఇమేజ్ పంపుతుంటారు. అయితే సౌదీ అరేబియా, కువైట్‌లో వాట్సాప్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు గుండె ,హార్ట్ ఎమోజీని పంపిన వారు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారని సౌదీ, కువైట్ మీడియా తాజాగా తెలిపింది.

కువైట్‌లో హార్ట్ ఎమోజీని పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్ల (రూ.5,35,825) జరిమానా విధిస్తున్నారు.కువైట్‌తో పాటు, సౌదీ అరేబియాలో కూడా సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీని పంపడం అభ్యంతరకరం అని నివేదికలు చెబుతున్నాయి. రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే సౌదీలో జైలు శిక్ష విధిస్తారు. సౌదీ చట్టం ప్రకారం నేరం రుజువైతే రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అదనంగా 100,000 సౌదీ రియాల్స్ (రూ.21,93,441) జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.


Similar News