HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. వడ్డీ రేట్లు పెంపు..!

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్(Private Sector Bank) అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank) రుణ గ్రహీతలకు షాకిచ్చింది.

Update: 2024-11-08 10:13 GMT
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. వడ్డీ రేట్లు పెంపు..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్(Private Sector Bank) అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్, ఒక లాంగ్ టర్మ్ టెన్యూర్ లోన్లపై స్వల్పంగా వడ్డీ రేట్ల(Interest Rates)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బెస్డ్‌ లెండింగ్‌ రేటు(MCLR)ని 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో సంవత్సరం కాల పరిమితి(Year Time limit)తో ఎక్కువ మంది తీసుకునే పర్సనల్ లోన్స్(Personal Loans), వాహన రుణాల(Vehicle Loans)పై వడ్డీరేట్లు అధికం కానున్నాయి. దీంతో వడ్డీరేటు సుమారు 9.45 శాతానికి పెరగనుంది. ఇక ఒక్క రోజు లోన్స్ పై వడ్డీ రేటు 9.10 శాతం నుంచి 9.15 శాతం వరకు చేరుకోగా.. నెల కాలపరిమితితో తీసుకునే రుణాలపై వడ్డీ 9.20 శాతానికి చేరుకుంది. 

Tags:    

Similar News