HDFC Bank: కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బిగ్ షాక్.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్(Private Sector Bank) అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank) రుణ గ్రహీతలకు బిగ్ షాకిచ్చింది.

Update: 2024-12-09 16:51 GMT
HDFC Bank: కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బిగ్ షాక్.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్(Private Sector Bank) అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC Bank) రుణ గ్రహీతలకు బిగ్ షాకిచ్చింది. షార్ట్ టర్మ్(Short Term) టెన్యూర్ లోన్లపై స్వల్పంగా వడ్డీ రేట్ల(Interest Rates)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓవర్‌నైట్ టెన్యూర్(Overnight Tenure) రుణాలపై మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బెస్డ్‌ లెండింగ్‌ రేటు(MCLR)ని 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీరేటు 9.15 నుంచి 9.25 శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయం డిసెంబర్ 7 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఒక్క టెన్యూర్‌పైనే బ్యాంక్ లోన్ వడ్డీ రేట్లు పెంచింది. మిగతా టెన్యూర్ ఎంసీఎల్ఆర్ మాత్రం అంతే ఉంచింది. ప్రస్తుతం ఈ బ్యాంకులో ఎంసీఎల్ఆర్ రేట్లు 9.20 నుంచి గరిష్టంగా 9.50 వరకు ఉన్నాయి.

Tags:    

Similar News