పోయిన మొబైల్‌ఫోన్‌లను ట్రాక్ చేసేందుకు కొత్త వ్యవస్థ!
కేంద్రం త్వరలో కొత్త టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.
న్యూఢిల్లీ: కేంద్రం త్వరలో కొత్త టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. పోగొట్టుకోవడం లేదా దొంగతనం అయిన మొబైల్‌ఫోన్‌లను ట్రాక్ చేయడమే కాకుండా బ్లాక్ చేసే టెక్నాలజీని ప్రభుత్వం ఈ వారం దేశవ్యాప్తంగా అమల్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అవసరమైన ప్రణాళిక పూర్తయిందని, సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్(సీడీఓటీ) ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్‌లతో సహా కొన్ని టెలికాం సర్కిల్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేశారు. ఈ నెల 17న సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) సిస్టమ్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించినట్టు అని ఓ అధికారి తెలిపారు.
అయితే, ఖచ్చితమైన తేదీని ఇంకా నిర్ణయించలేదని సీడీఓటీ సీఈఓ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు. మొబైల్‌ఫోన్‌లను ట్రాక్ చేసే వ్యవస్థకు సంబంధిచి ఫోన్ అమ్మడానికి ముందు దాని ఐఏంఈఐ నెంబర్ బహిర్గతం చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఉంచింది. ఈ నంబర్లు మొబైల్ నెట్‌వర్క్ సంస్థల వద్ద ఉంటాయి. ఒకవేళ అనధికార మొబైళ్లు తమ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తే టెలికాం కంపెనీలు గుర్తించడానికి వీలుంటుంది. సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా మొబైల్ నెట్‌వర్క్ల వద్ద ఐఎంఈఐ నంబర్లు, వాటికి లింక్ అయిన మొబైల్ నంబర్ల లిస్ట్ ఉంటుంది. ఆ సమాచారం ద్వారానే పోగొట్టుకున్న, దొంగతరం అయిన మొబైల్‌ఫోన్‌లను ట్రాక్ చేస్తారు.
Also Read..