బంగారు ఆభరణాల దిగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) భాగస్వామ్య యూఏఈ దేశానికి మినహాయింపు కల్పించారు.

Update: 2024-06-11 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అనూహ్య సరఫరా పెరుగుదల కారణంగా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి బంగారు ఆభరణాలు, విడిభాగాల దిగుమతులపై ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) భాగస్వామ్య యూఏఈ దేశానికి మినహాయింపు కల్పించారు. ఈ మేరకు మంగళవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. బంగారు ఆభరణాలతో పాటు ముత్యాలు, విజ్రాలు, విలువైన రాళ్లతో పొదిగిన బంగారం, విడిభాగాలను ఉచిత దిగుమతి విభాగం నుంచి తొలగిస్తూ డీజీఎఫ్‌టీ ఉత్తర్వులిచ్చింది. బంగారు ఆభరణాల విడిభాగాలకు సంబంధించి గతేడాది 51.51 మిలియన్ డాలర్ల(రూ. 430 కోట్ల) నుంచి 2023-24లో 30 రెట్లు పెరిగి సుమారు రూ. 13 వేల కోట్లకు చేరింది. ప్రధానంగా యూఏఈ(రూ. 8,360 కోట్లు), ఇండోనేషియా(రూ. 2,860 కోట్లు), టాంజానియా(రూ. 896 కోట్లు), థాయ్‌లాండ్(రూ. 300 కోట్లు) నుంచి దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఆంక్షలు విధిచ్నిన ముత్యాలు, విజ్రాలు, విలువైన రాళ్లతో పొదిగిన బంగారు ఆభరణాల దిగుమతులు 2023-24లో రూ. 4,544 కోట్లుగా ఉన్నాయి. వీటి దిగుమతుల్లో అసాధారణ పెరుగుదలను గమనించి ప్రభుత్వం ఆంక్షల నిర్ణయం తీసుకుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. 


Similar News