'2023-24లో ప్రభుత్వ బీమా సంస్థలకు మూలధన నిధులు ఉండవు'!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ నాలుగు సాధారణ బీమా సంస్థలు ప్రభుత్వం నుంచి మూలధన నిధులను పొందే అవకాశం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Update: 2023-08-27 16:25 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ నాలుగు సాధారణ బీమా సంస్థలు ప్రభుత్వం నుంచి మూలధన నిధులను పొందే అవకాశం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది ప్రభుత్వం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ. 5,000 కోట్ల మూలధనాన్ని అందించింది. 2023-24 బడ్జెట్‌లో బీమా కంపెనీలకు మూలధనం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సంస్థలకు మూలధన నిధులు అవసరం లేదని భావిస్తున్నామని అధికారి చెప్పారు.

ప్రస్తుతం పీఎస్‌యూ సాధారణ బీమా కంపెనీలైన న్యూ ఇండియా అస్యూరెన్స్, యునైటెడ్ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండగా, న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే మిగిలిన వాటి కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వానికి డివిడెండ్ ఇవ్వొచ్చని అధికారి వివరించారు. 2020-21లో మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు ప్రభుత్వం రూ. 9,950 కోట్లు అందించింది. అందులో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 3,605 కోట్లు, నేషనల్ ఇన్సూరెన్స్‌కు రూ. 3,175 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు రూ. 3,170 కోట్లు అందించింది.


Similar News