మార్చి 7 : బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ప్రియులకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రస్తుతం పెళ్లీసీజన్ కావడంతో నేడు గోల్డ్ రేట్స్ పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈరోజు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో

Update: 2024-03-07 06:26 GMT

దిశ, ఫీచర్స్ : బంగారం ప్రియులకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రస్తుతం పెళ్లీసీజన్ కావడంతో నేడు గోల్డ్ రేట్స్ పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈరోజు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నిన్న (బుధవారం),22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,700 ఉండగా, నేడు(గురువారం) రూ.400 పెరగడంతో గోల్డ్ రేట్,రూ.60,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 65,130 ఉండగా, నేడు 430 పెరగడంతో, గోల్డ్ రేట్ రూ.65,560గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.60,100

24 క్యారెట్ల బంగారం ధర - రూ.65,560

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.60,100

24 క్యారెట్ల బంగారం ధర – రూ.65,560


Similar News