Gold Rate : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు!
మహిళలు ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉన్నదా అంటే అది బంగారమే. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోవాలని అనుకుంటారు. అంతే కాకుండా ఎక్కువ తక్కువ
దిశ, ఫీచర్స్ : మహిళలు ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉన్నదా అంటే అది బంగారమే. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు ఒంటినిండా బంగారు నగలతో మెరిసిపోవాలని అనుకుంటారు. అంతే కాకుండా ఎక్కువ తక్కువ బంగారం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడతారు. దీంతో ఎప్పుడు బంగారం తగ్గితే అప్పుడు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే ఇటీవల బాగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు కాస్త దిగొస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నేడు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అందిందనే చెప్పవచ్చు. ఎందుకంటే? నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.64,800 ఉండగా, నేడు రూ.100 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ.64,700గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.70,690 ఉండగా, నేడు 110 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.70,580గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.64,700
24 క్యారెట్ల బంగారం ధర - రూ.70,580
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.64,700
24 క్యారెట్ల బంగారం ధర – రూ.70,580