Adani & Ambani: లెజెండ్స్ కు మరణం లేదు : వ్యాపారవేత్తలు

రతన్ టాటా మృతి పట్ల ప్రముఖ వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు దేశానికే తీరనిదని పేర్కొన్నారు.

Update: 2024-10-10 04:03 GMT

దిశ, వెబ్ డెస్క్: లెజెండ్స్ కు మరణం లేదని, ఆయన మన మనసుల్లో చిరకాలం నిలిచి ఉండిపోతారన్నారు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani). రతన్ టాటా (Ratan Tata) మరణం పట్ల గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. దేశ అభివృద్ధిపై రతన్ టాటా ప్రభావాన్ని చూపారని, ఒక దిగ్గజాన్ని కోల్పోయామన్నారు. ఆయన కేవలం వ్యాపార నాయకుడు మాత్రమే కాదని, సమగ్రత, కరుణ, తిరుగులేని నిబద్ధతతో దేశస్ఫూర్తిని మూర్తీ భవించారన్నారు.

భారతదేశం గర్వపడే వ్యక్తి రతన్ టాటా అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ సురేష్ పేర్కొన్నారు.

ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను.. రతన్ టాటా మృతి దేశానికే తీరని లోటు.. ఆయన్ను కలిసిన ప్రతీ సందర్భంలోనూ నాలో స్ఫూర్తి నిండేది అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News