FSSAI: పాల ఉత్పత్తుల ప్యాకేజీలపై ఏ1, ఏ2 క్లెయిమ్‌లను తొలగించాలన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ
అన్ని పాలు, పాల ఉత్పత్తుల ప్యాకేజీలపై ఇస్తున్న ఏ1, ఏ2 వంటి క్లెయిమ్‌లను తొలగించాలని కోరింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గురువారం ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు(ఎఫ్‌బీఓ), ఈ-కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాలు, పాల ఉత్పత్తుల ప్యాకేజీలపై ఇస్తున్న ఏ1, ఏ2 వంటి క్లెయిమ్‌లను తొలగించాలని కోరింది. అనేక ఎఫ్‌బీఓలు పాలు, నెయ్యి, వెన్న, పెరుగు మొదలైన పాల ఉత్పత్తులనుఎ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్‌తో ఏ1, ఏ2 పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చింది. అయితే, ప్రధానంగా ఆయా ఉత్పత్తులు ఏ1,ఏ2 అనేవి ప్రొటీన్ నిర్మాణంలో తేడాను సూచించేవి మాత్రమేనని, పాల నాణ్యతను, బేధాలాను గుర్తించేందుకు కాని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. కాబట్టి పాల ఉత్పత్తులపై ఈ రకమైన క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఇది ఆహార భద్రతా ప్రమాణాల చట్టం-2006 నిబంధనలకు అనుగుణంగా లేవని వెల్లడించింది. ఎఫ్‌బీఓలు తాజా నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి నిబంధనల అమలవుతుందని, ఆరు నెలల్లోపు అన్ని లేబుళ్లలో మార్పులు చేయాలని, తదుపరి గడువు పొడిగింపు ఉండదని పేర్కొంది.