రెండేళ్లలో రూ.41,000 కోట్లకు తగ్గిన ఫ్లిప్‌కార్ట్ వాల్యుయేషన్
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ విలువ రెండేళ్లలో రూ.41,000 కోట్లు తగ్గింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ విలువ రెండేళ్లలో రూ.41,000 కోట్లు తగ్గింది. మాతృ సంస్థ వాల్‌మార్ట్ నిర్వహించిన ఈక్విటీ లావాదేవీల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ విలువను $40 బిలియన్లుగా లెక్కగట్టగా, జనవరి 31, 2024 నాటికి $35 బిలియన్లకు తగ్గింది. ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేని ప్రత్యేక కంపెనీగా విడదీయడమే దాని మార్కెట్ విలువ తగ్గడానికి కారణం అని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. 2022లో వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో $3.2 బిలియన్ విలువ చేసే 8 శాతం ఈక్విటీ వాటాలను విక్రయించింది. ఆ తరువాత 2024లో $3.5 బిలియన్లను చెల్లించి మరో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా 85 శాతానికి చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.56 వేల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.