ఫేస్‌బుక్ మెసేంజర్ విభాగంలో ఉద్యోగులను తొలగించిన మెటా

ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణలు వంటి కారణాలతో ఇంటికి సాగనంపుతున్న మెటా, మెసేంజర్ విభాగంలో 50 మందిపై వేటు వేసింది.

Update: 2024-03-08 08:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ సామర్థ్యంపై దృష్టి పెడుతున్నామని, దాని ఫలితంగా అనేక మార్పులు వస్తాయని ప్రకటించారు. ఈ ప్రకటన ఉద్యోగులకు శాపంగా మారింది. గడిచిన సంవత్సర కాలంలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత తాజాగా మరోసారి మెటా లేఆఫ్స్‌ను ప్రకటించింది. ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణలు, సామర్థ్య పెంపు వంటి కారణాలతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మెటా, ఇప్పుడు మెసేంజర్ విభాగంలో పనిచేస్తున్న 50 మందిపై వేటు వేసింది. ఫేస్‌బుక్ మేసేంజర్ కార్యకలాపాల్లో మార్పుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునంట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికి తాజా లేఆఫ్స్‌పై కంపెనీ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ పునర్‌వ్యవస్థీకరణ, సామర్థ్యంపై సమీక్ష కొనసాగుతున్నట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. పలు నివేదికల ప్రకారం, మెటా యాజమాన్యం ప్రస్తుతానికి ఖర్చులు తగ్గించుకోవడం, టీమ్‌లను క్రమబద్దీకరించే క్రమంలో కొంతమంది ఉద్యోగులపై ప్రభావం ఉండవచ్చని సమాచారం. సంస్థ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించినప్పటికీ దానివల్ల ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోననే ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. 

Tags:    

Similar News