14,000 మందిని తొలగించిన టెస్లా

తొలగింపుల గురించి కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఉద్యోగులకు లేఖ రాసినట్టు సమాచారం.

Update: 2024-04-15 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా భారీ లేఆఫ్ ప్రకటించింది. అంతర్జాతీయంగా కంపెనీలోని 14,000 మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 10 శాతానికి సమానం. తొలగింపుల గురించి కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఉద్యోగులకు లేఖ రాసినట్టు సమాచారం. అయితే, ఇటీవలే టెస్లా ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగులకు మెరుగైన జీతం ఇవ్వాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నట్టు కథనాలు వచ్చిన సమయంలోనే తొలగింపులు జరగడం గమనార్హం. తాజా తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా కంపెనీ కొత్త ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం, తద్వారా కొన్ని విభాగాల్లో ఉన్న డూప్లికేషన్ రోల్స్ ఏర్పడ్డాయి. అందుకే తొలగిస్తున్నట్టు ఎలన్ మస్క్ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఖర్చులను తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం కఠినమైనదే అయినప్పటికీ తప్పట్లేదని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగులకు సైతం కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి కంపెనీలోని ఏయే విభాగాల్లో లేఆఫ్ ఉండనున్నది స్పష్టత ఇవ్వలేదు.  

Tags:    

Similar News