సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేయనున్న ఎలాన్ మస్క్..?

సంక్షోభంలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చే ఆలోచనకు సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.

Update: 2023-03-11 09:32 GMT

కాలిఫోర్నియా: సంక్షోభంలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చే ఆలోచనకు సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు. శుక్రవారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను అమెరికా నియంత్రణ సంస్థలు మూసివేయడంతో పాటు, దాని ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. దీంతో రేజర్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ మిన్-లియాంగ్ టాన్ ట్విట్టర్‌లో, "సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసి, దానిని డిజిటల్ బ్యాంక్‌గా మార్చడాన్ని ట్విట్టర్ పరిగణించాలని" పోస్ట్ చేశారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ, "నేను ఈ ఆలోచనకు సిద్ధంగా ఉన్నాను" అని తెలిపారు.

ఇటీవల ట్విట్టర్‌‌ను కొనుగోలు చేసిన మస్క్ దీనిని 'ఎవ్రీథింగ్ యాప్' గా మార్చే దిశగా మొదటి అడుగుగా డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మస్క్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌‌ను కొనుగోలు చేసినట్లయితే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌‌ అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంకు. స్టార్ట్-అప్‌లకు ఫైనాన్సింగ్ చేయడం దీని ప్రత్యేకత. అమెరికాలో సగం వెంచర్ క్యాపిటల్ అంకుర సంస్థలతో ఇది వ్యాపారం చేస్తుంది

Tags:    

Similar News