టమాట ధరలు ఎప్పుడు తగ్గనున్నాయో తెలుసా?

గత రెండు వారాల నుంచి టమాట ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

Update: 2023-06-28 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు వారాల నుంచి టమాట ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. సాధారణంగా టమాట కేజీ రూ. 30 లోపే ఉండేది. కానీ ఒక్కసారిగా కేజీ టమాట100 నుంచి 120 వరకు పెంచడంతో సామాన్యులకు, మధ్యతరగతి జనాలకు టమాట కొనుగోలు కష్టసాధ్యంగా మారింది. అయితే కేంద్రం తాజాగా స్పందించి.. ‘పది, పదిహేను రోజుల్లో టమాట ధరలు సాధారణ స్థితికి వస్తాయని తెలిపింది. టమాట తాజా లోడ్‌లు అన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి రెండు వారాలు పడుతుంది. ఆ తర్వాత ధరలు కచ్చితంగా దిగివస్తాయని కేంద్రం వెల్లడించింది. 

Read More:   వర్షాకాలం వచ్చింది.. విద్యుత్ తో జర పైలం.. 

Tags:    

Similar News