దీపావళి ఎఫ్టెక్.. ఈ రోజు నుంచి బ్యాంకులకు 5 రోజులు సెలవులు

దీపావళి పండుగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇవి వర్తిస్తాయి.

Update: 2023-11-11 03:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇవి వర్తిస్తాయి. వరుసగా పండుగలు రావడంతో బ్యాంకులు 5 రోజులు బంద్ కానున్నాయి. సిక్కింలో వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. బ్యాంకులకు సెలవులు ప్రకటించినా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా పని చేస్తూనే ఉంటాయని బ్యాంకింగ్ అధికారులు చెప్పారు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, తొమ్మిది సెలవులు పండుగ లేదా గెజిట్. కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా సెలవులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

బ్యాంకుల సెలవులు...

నవంబర్ 11 (శనివారం): భారతదేశంలో అన్ని బ్యాంకులు మూసివేశారు.

నవంబర్ 12 (ఆదివారం): ఆదివారం, దీపావళి సందర్భంగా బ్యాంకులు మూత పడనున్నాయి.

నవంబర్ 13 (సోమవారం): గోవర్ధన్ పూజ కోసం త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.

నవంబర్ 14 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలో దీపావళికి బ్యాంకులు మూసివేయనున్నారు.

నవంబర్ 15 (బుధవారం): భాయ్ దూజ్ పర్వదినం సందర్భంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయనున్నారు.

బ్యాంకులకు సెలవు ఉన్నా.. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీస్​, ఏటీఎం వంటి సేవలు పనిచేస్తాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. మనీని కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవడం కుదురుతుంది. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు.

Tags:    

Similar News