టికెట్ బుకింగ్, అమ్మకాలను నిలిపేయాలని గో ఫస్ట్‌కు డీజీసీఏ ఆదేశాలు!

సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కీలక ఆదేశాలిచ్చింది

Update: 2023-05-08 10:35 GMT

న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కీలక ఆదేశాలిచ్చింది. తదుపరి ఆర్డర్ వచ్చే వరకు నేరుగా లేదా పరోక్షంగా బుకింగ్, టికెట్ అమ్మకాలను నిలిపేయాలని తెలిపింది. అంతేకాకుండా ఎయిర్‌క్రాఫ్ట్ రూప్స్-1937 నిబంధనల ప్రకారం, కార్యకలాపాలను సురక్షితంగా, సమర్థవంతంగా, నమ్మకంగా కొనసాగించడంలో విఫలమైనందున సంస్థకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది.

ఇప్పటికే గో ఫస్ట్ సంస్థ మే 15 వరకు టికెట్ల విక్రయాన్ని నిలిపేసింది. మే 12 వరకు ఉన్న విమానాలను రద్దు చేసింది. గోఫస్ట్‌ ప్రమోటర్‌ వాడియా గ్రూప్‌ స్వచ్ఛంద దివాలా ప్రక్రయ కోసం జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల బెంచ్‌ ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది.

ఈ నేపథ్యంలో డీజీసీఏ తక్షణమే టికెట్ల బుకింగ్, అమ్మకాలను నిలిపేయాలని సోమవారం నోటీసుల్లో స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులు అందిన 15 రోజుల్లోగా బదులు ఇవ్వాలని, దాని ఆధారంగానే ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికెేట్(ఏఓసీ) కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.


Also Read..

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్.. భారీగా పెంచిన రుణ రేట్లు 

Tags:    

Similar News