భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల మార్కెట్ వాటా!

దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్లకు ఊహించని స్థాయిలో గిరాకీ పెరిగింది.

Update: 2023-10-04 14:29 GMT

ముంబై: దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్లకు ఊహించని స్థాయిలో గిరాకీ పెరిగింది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొట్టమొదటిసారిగా రూ. కోటి కంటే ఎక్కువ ధర కలిగిన హై-ఎండ్ ఇళ్ల అమ్మకాలు బడ్జెట్ ఇళ్ల విభాగాన్ని అధిగమించి అత్యధిక డిమాండ్‌ను నమోదు చేశాయి. బుధవారం విడుదలైన 'ఇండియా రియల్ ఎస్టేట్ క్యూ3-2023' నివేదిక ప్రకారం, ఈ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు ఆరేళ్ల గరిష్ఠంతో 82,612 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 73,691 యూనిట్ల కంటే ఇది 12 శాతం ఎక్కువ. వాటిలో రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఇళ్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఈ విభాగం 29,827 యూనిట్లతో 36 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.

అలాగే, గతేడాది 14 శాతం అమ్మకాలు పెరిగాయి. ఇక, రూ. కోటి కంటే ఎక్కూ ఖరీదైన ఇళ్లు 35 శాతం వాటాను సొంతం చేసుకోవడం విశేషం. ఈ విభాగం అత్యంత వేగంగా పెరిగింది. సమీక్షించిన త్రైమాసికంలో ఈ విభాగం 39 శాతం పెరిగి 28,642 యూనిట్లు విక్రయించబడ్డాయి. రూ. 50 లక్షల్లోపు ఇళ్ల వాటా 36 శాతం నుంచి 29 శాతానికి తగ్గంది. గతేడాది ఈ విభాగంలో 10,198 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 9,930 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. బడ్జెట్ ఇళ్ల మార్కెట్ వాటా 2018 నాటితో పోలిస్తే 54 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం.


Similar News