Apple devices: యాపిల్ డివైస్ వాడుతున్న వారికి అలెర్ట్

యాపిల్‌ (Apple) కంపెనీకి చెందిన ప్రాడక్ట్స్ వాడుతున్న వారిని కేంద్రం అలెర్ట్ చేసింది. ఐఫోన్స్‌, మ్యాక్స్‌, యాపిల్‌ వాచీలు వాడుతున్నవారికి పలు సూచనలు చేసింది.

Update: 2024-11-12 10:26 GMT

దిశ, బిజినెస్: యాపిల్‌ (Apple) కంపెనీకి చెందిన ప్రాడక్ట్స్ వాడుతున్న వారిని కేంద్రం అలెర్ట్ చేసింది. ఐఫోన్స్‌, మ్యాక్స్‌, యాపిల్‌ వాచీలు వాడుతున్నవారికి పలు సూచనలు చేసింది. ఔట్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈమేరకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) అడ్వైజరీని జారీ చేసింది. ఆయా డివైజులు వాడుతున్న వారికి ‘హైరిస్క్‌’ పొంచి ఉన్నట్లు పేర్కొంది. పాత సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ లోపాల కారణంగా యాపిల్‌ డివైజుల్లో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా చొరబడి సెన్సిటివ్‌ డేటాను యాక్సెస్‌ చేయడం లేదా డేటా మానిప్యులేషన్‌కు పాల్పడే అవకాశం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది.

సెర్ట్- ఇన్ సూచనలు

ఐఓస్‌ 18.1 కంటే ముందు వెర్షన్‌ కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్‌ఓఎస్‌ 18.1 కంటే ముందు వెర్షన్‌ కలిగిన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్‌ఓఎస్‌ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్‌ ఓఎస్‌ 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్‌ కలిగిన యాపిల్‌ వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. వీటితో పాటు పాత టీవీఓఎస్‌, విజన్‌ఓఎస్‌, సపారీ బ్రౌజర్లకు కూడా ఇలాంటి ముప్పు ఉందని తెలిపింది. అయితే, సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను యాపిల్‌ ఇదివరకే గుర్తించింది. కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌లో పరిష్కారం చూపించింది. కాగా.. ఇంకా ఎవరైనా పాత సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు వాడుతున్నారో వారు వెంటనే తమ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సెర్ట్- ఇన్ సూచించింది.

Tags:    

Similar News