ఇండియాలో చైనా BYD పెట్టుబడులకు నో పర్మిషన్..?!

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ, ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసిందే.

Update: 2023-07-15 07:38 GMT

హైదరాబాద్: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ, ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసిందే. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, బ్యాటరీల తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌తో కలిసి దాదాపు రూ.8,212 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం.

అయితే ఈ పెట్టుబడుల గురించి కీలక విషయం బయటకు వచ్చింది. చైనాతో జరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కేంద్ర ప్రభుత్వం బీవైడీని ఇండియాలోకి అనుమతించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఒక నివేదిక తెలిపింది. ఇప్పటికే చైనాకు చెందిన కంపెనీలకు కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేసింది.

వివిధ యాప్‌ల పట్ల కూడా నిషేధం విధించింది. చైనా కంపెనీలు భారత్‌లో కొత్త కంపెనీలను ఏర్పాటు చేయడం, లేదా దేశీయ కంపెనీల భాగస్వామ్యంతో పెట్టుబడులు పెట్టడం లాంటివి చేసినప్పటికి వీటి నియంత్రణ మాత్రం చైనా నుంచి ఉంటుందని, దేశీయంగా భద్రతా పరమైన ఆందోళనల కారణంగా కేంద్రం చైనా కంపెనీల పట్ల కఠినంగా ఉంటుంది, కాబట్టి బీవైడీ పెట్టుబడులను ఇండియాలోకి అనుమతించే అవకాశం ఉండకపోవచ్చు అని ఒక నివేదిక తెలిపింది.

Tags:    

Similar News