వచ్చే ఏడాది నుంచి పెరగనున్న వాహనాల ధరలు!

దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో దేశీయ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలు పెరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను అప్‌గ్రే చేసేందుకు వాహన తయారీ కంపెనీలు పెట్టుబడులను ప్రారంభించాయి.

Update: 2022-10-09 11:17 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో దేశీయ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలు పెరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను అప్‌గ్రే చేసేందుకు వాహన తయారీ కంపెనీలు పెట్టుబడులను ప్రారంభించాయి. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం తమ ఉత్పత్తులను భారత్ స్టేజ్-వీ రెండో దశకు అనుగుణంగా మార్పులు చేయనున్నాయి.

దీంతో కంపెనీలు ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలకు తదుపరి స్థాయి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా మరింత అధునాత పరికరాలను అమర్చాల్సి ఉంటుంది. దీనివల్ల వాహనాల మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని పెంచాల్సి వస్తుంది. కాబట్టి ఈ భారం వచ్చే ఏడాది నుంచి వాహన కొనుగోలుదారులపై కూడా పడనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను మానిటర్ చేసేందుకు వాహనాలు సెల్ఫ్-డయాగ్నస్టిక్ పరికరాన్ని కలిగి ఉండాలి.

ఉద్గారాలపై నిఘా ఉంచేందుకు కేటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ వంటి వాహనంలోని కీలక భాగాలను ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ పరికరం పర్యవేక్షిస్తుంది. కొత్త నిబంధనల కారణంగా మొత్తం వాహన ధరలో స్వల్ప పెరుగుదలకు దారి తీయనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌పై పెట్టే పెట్టుబడుల కంటే ఈ సెల్ఫ్-డయాగ్నస్టిక్ పరికరాన్ని అమర్చేందుకు ఎక్కువ భాగం ఖర్చు అవుతుంది. కాబట్టి తయారీ వ్యయానికి అనుగుణంగా వాహన ధరలు పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 

Tags:    

Similar News