CARS: పండుగ సీజన్‌‌కు కంపెనీలు సిద్ధం.. కార్లపై భారీ తగ్గింపులు, డిస్కౌంట్లు

రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో వివిధ కార్ల తయారీ దారులు తమ అమ్మకాలను పెంచుకోవడానికి భారీ తగ్గింపులు, డిస్కౌంట్లు అందించడానికి సిద్ధమయ్యారు.

Update: 2024-09-03 12:11 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో వివిధ కార్ల తయారీ దారులు తమ అమ్మకాలను పెంచుకోవడానికి భారీ తగ్గింపులు, డిస్కౌంట్లు అందించడానికి సిద్ధమయ్యారు. మోడల్‌ను బట్టి ధరలపై తగ్గింపును ప్రకటిస్తున్నారు. డీలర్లు కూడా మోడల్ ధరను బట్టి రూ. 10,000 నుండి 2.5 లక్షల వరకు నగదు తగ్గింపును అందజేస్తున్నారు. తయారీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్ద ఉన్న కొత్త మోడల్స్‌ను డీలర్‌లకు అందించడం మొదలుపెట్టాయి. పండుగ సీజన్‌లో దేశీయ వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, క్యాష్ డిస్కౌంట్‌ల పేరిట తమ సేల్స్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి.

మారుతీ సుజుకి ఇండియా ఎంపిక చేసిన వేరియంట్‌ల ధరలను ఇప్పటికే తగ్గించింది. కొత్త స్విఫ్ట్, బ్రెజ్జాపై రూ.10,000 నగదు తగ్గింపును, ఆల్టో కె10 సెలెరియో, ఎస్-ప్రెస్సోపై రూ.30,000-40,000, బాలెనోపై రూ.25,000-30,000 తగ్గింపులు ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్స్.. Grand i10 Nios‌పై రూ.25,000-35,000, ఆరాపై రూ.10,000-30,000, ఎక్స్‌టర్‌పై రూ.20,000, వెన్యూపై రూ. 35,000-45,000 తగ్గింపు ఇస్తుంది.

టాటా మోటార్స్.. టియాగోపై రూ.25,000-3,000, టిగోర్‌పై రూ.25,000-30,000, ఆల్ట్రోజ్‌పై రూ. 15,000-25,000, పంచ్‌పై రూ.15,000-20,000 తగ్గింపు అందిస్తుంది. మహీంద్రా & మహీంద్రా కంపెనీ ఇటీవలే XUV7OO ధరలను రూ. 2.2 లక్షల వరకు తగ్గించగా, బొలెరో నియోపై రూ. 85,000, XUV 4OOపై రూ. 50,000 నగదు తగ్గింపును అందిస్తోంది.


Similar News