Canara Bank Q2 Results: రెండో త్రైమాసికంలో రాణించిన కెనరా బ్యాంక్.. రూ. 4,104 కోట్ల లాభం
భారతదేశం(India)లోని ప్రముఖ కంపెనీలు గత కొన్ని రోజులుగా సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాల(Quarter Results)ను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని ప్రముఖ కంపెనీలు గత కొన్ని రోజులుగా సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాల(Quarter Results)ను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్(Canara Bank) త్రైమాసిక ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ సారి ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ 11.31 శాతం వృద్ధితో రూ. 4,104 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ. 3606 కోట్లుగా ఉందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ.31,473 కోట్ల నుంచి రూ.34,721 కోట్లకు చేరుకుందని, ఇందులో వడ్డీల రూపంలో రూ.29,740 కోట్లు వచ్చాయని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ(MD&CEO) కె. సత్యనారాయణ రాజు(K. Satyanarayana Raju) తెలిపారు. అలాగే ఈ త్రైమాసికంలో డిపాజిట్లు 9.34, లోన్స్ 9.53 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. కాగా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కెనరా బ్యాంక్ షేరు ధర 0.31 శాతం మేర తగ్గి రూ.103 వద్ద ముగిసింది.