వడ్డీ రేట్లను పెంచిన కెనరా బ్యాంక్

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను సవరించింది.

Update: 2023-03-11 11:28 GMT

ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను సవరించింది. దీంతో గృహ రుణ రేట్లు, ఇతర రుణ రేట్లు పెరగనున్నాయి. సవరించిన వడ్డీ రేట్లు మార్చి 12, 2023 నుండి అమలులోకి వస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 7.55% నుండి 7.90%కి(35 బేసిస్ పాయింట్లు) పెంచింది. ఒక నెల MCLR 7.55% నుండి 8%కి(45 బేసిస్ పాయింట్లు), ఆరు నెలల MCLR 8.30% నుండి 8.40%కి(10 బేసిస్ పాయింట్లు) పెరిగింది. అదే ఏడాది ప్రాతిపదికన 8.50% నుండి 8.60%కి పెంచింది. MCLR అనేది బ్యాంకు రుణం ఇచ్చే కనీస వడ్డీ రేటు, దీనిని పెంచినట్లయితే వినియోగదారులపై భారం పడుతుంది. వారి గృహ రుణాలు, ఇతర EMIలు మరింత పెరగనున్నాయి.

Also Read..

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేయనున్న ఎలాన్ మస్క్..? 

Tags:    

Similar News