Biju's: దివాలా కొనసాగితే బైజూస్ షట్‌డౌన్‌ను అయ్యే అవకాశం

ఈ మేరకు కంపెనీ సీఈఓ తన కోర్టు ఫైలింగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Update: 2024-07-19 17:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లతో దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీగా ఎదిగిన ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ కష్టాలు అంతిమ దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. తాజా పరిణామాల మధ్య బైజూస్‌పై దివాలా చర్యల కారణంగా ఒకవేళ కంపెనీ తన సేవలను పూర్తిగా నిలిపివేస్తే వేలాది మంది ఉద్యోగులు వీధిన పడనున్నారు. ఈ మేరకు కంపెనీ సీఈఓ తన కోర్టు ఫైలింగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రోసస్, జనరల్ అట్లాంటిక్ లాంటి దిగ్గజ పెట్టుబడిదారుల మద్దతు ఉన్న బైజూస్ ఇటీవలి నెలల్లో అనేక ఒడిదుడుకులను చూసింది. అందులో ఉద్యోగాల కోత, వాల్యూయేషన్‌లో విఫలమవడం, కార్పొరేట్ గవర్నెన్స్ లోపభూయిష్టంగా సీఈఓ బైజు రవీంద్రన్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటిని బైజూస్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దివాలా ప్రక్రియ కొనసాగితే బైజూస్‌కు కీలకమైన సేవలందించే విక్రేతలు డిఫాల్ట్‌గా ప్రకటించి మొత్తం సేవలను నిలిపివేసే అవకాశం ఉంది. దివాలా ప్రక్రియను రద్దు చేయాలని బైజూస్ రవీంద్ర కోర్టుకు అప్పీల్ చేశారు. అనంతరం కేసును సోమవారం విచారించనున్నట్టు కోర్టు పేర్కొంది. కాగా, బైజూస్‌లో 16,000 మంది ఉపాధ్యాయులతో సహా దాదాపు 27,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Tags:    

Similar News