BSNL: సిగ్నల్స్, ఇంటర్నెట్ సరిగా రావడం లేదు.. బీఎస్‌ఎన్‌ఎల్ పై కస్టమర్లు ఆగ్రహం..!
దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో(Jio), భారతీ ఎయిర్‌టెల్(Airtel), వోడాఫోన్ ఐడియా(Vi) ఈ ఏడాది జులైలో టారిఫ్ రేట్లను భారీగా పెంచిన విషయం గుర్తుండే ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel), వోడాఫోన్ ఐడియా(Vi) ఈ ఏడాది జులైలో టారిఫ్ రేట్లను భారీగా పెంచిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(BSNL)కు పోర్ట్ అయ్యారు. రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచకపోగా.. ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తుండటంతో ఇతర సిమ్ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా ఈ సిమ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. గత అక్టోబర్ లో ఏకంగా 5 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ కు పోర్ట్ అయ్యారు.
అయితే రీఛార్జ్ రేట్లు తక్కువ ఉండటంతో ఇందులోకి పోర్ట్ అయ్యామని.. కానీ చాల చోట్ల సిగ్నల్స్(Signals) సరిగా రావట్లేదని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే ఇంటర్నెట్(Internet) కూడా చాల చోట్ల స్లో(Slow)గా వస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్స్ లేనప్పుడు స్పెషల్ ఆఫర్ల పెట్టి యూజ్ ఏంటని విమర్శిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసిన సంస్థ పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. కాగా 2025 మే నాటికి 4జీ, జూన్ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ చెబుతోంది. 4జీ/ 5జీ సర్వీసులు స్టార్ట్ అయ్యాకైనా సిగ్నల్ సరిగా వస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.