'Make In India' కు బోయింగ్ సపోర్ట్!

భారత ప్రభుత్వం నిర్వహించే మేక్-ఇన్ ఇండియా కార్యక్రమానికి తాము మద్దతిస్తున్నామని విమానాల తయారీ సంస్థ బోయింగ్ సీఈఓ డెవిడ్ ఎల్ కాల్‌హూన్ అన్నారు.

Update: 2023-06-26 10:36 GMT

వాషింగ్టన్: భారత ప్రభుత్వం నిర్వహించే మేక్-ఇన్ ఇండియా కార్యక్రమానికి తాము మద్దతిస్తున్నామని విమానాల తయారీ సంస్థ బోయింగ్ సీఈఓ డెవిడ్ ఎల్ కాల్‌హూన్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతివ్వడం ద్వారా దేశ వాణిజ్య వైమానిక రంగం విస్తరణలో కీలకంగా ఉంటామని ఆయన తెలిపారు.

భారత వాణిజ్య విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. దేశ రక్షణ రంగంలో యుద్ధ సన్నద్ధత, దాని ఆధునీకరణలో బోయింగ్ కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. భారత్‌లో 5 వేల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు పని చేస్తున్నారు. వారంతా భారత మేక్-ఇన్-ఇండియాలో భాగంగా ఉన్నారని సోమవారం ప్రకటనలో డెవిడ్ కాల్‌హూన్ వివరించారు.

బోయింగ్ సంస్థ భారత్‌లో పెట్టే పెట్టుబడులు కంపెనీకి ఉన్న భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని, యూఎస్, భారత్ ఆర్థిక సంబంధాలు సానుకూలంగా ముందుకెళ్లేందుకు దోహదపడతాయన్నారు. కాగా, అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బోయింగ్ సంస్థ సీఈఓతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతవారం జరిగిన పారిస్ ఎయిర్‌షో కార్యక్రమంలో భారత్‌కు చెందిన విమానయాన సంస్థలతో కొత్త ఆర్డర్లపై సంతకాలు చేసింది.

Also Read..

వచ్చే మూడేళ్లలో భారత్‌లో లులు గ్రూప్ రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు! 

Tags:    

Similar News