రూ.72 లక్షల ధరలో అధునాతన BMW కొత్త మోడల్

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ BMW నుంచి కొత్తగా లగ్జరీ మోడల్ కారు ఇండియా మార్కెట్లోకి విడుదల అయింది.

Update: 2024-07-25 10:25 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ BMW నుంచి కొత్తగా లగ్జరీ మోడల్ కారు ఇండియా మార్కెట్లోకి విడుదల అయింది. దీని పేరు ‘BMW 5 సిరీస్ LWD’. పాత వాటితో పోలిస్తే మరిన్ని అధునాతన సౌకర్యాలతో దీనిని తీసుకొచ్చారు. ప్రారంభ ధర రూ.72.90 లక్షలు. ఇది Mercedes-Benz E-క్లాస్‌కు ప్రత్యర్థిగా నిలవనుంది. BMW 5 సిరీస్ LWB పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. 6.5 సెకన్ల వ్యవధిలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 250kmph. ఇది 258hp శక్తిని, 400Nm టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ అసిస్ట్‌ను కూడా కలిగి ఉంది.

గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. కారు లోపల 14.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌తో 12.3-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌‌ను అమర్చారు. ఇంటీరియర్‌ ఫీచర్లలో నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, 655W బోవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ సిస్టమ్, USB-C పోర్ట్‌లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్‌ను తమిళనాడులోని చెన్నైలో స్థానికంగా ఉత్పత్తి చేశారు. డెలివరీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News