Bitcoin: 80,000 డాలర్లకు చేరువైన బిట్‌కాయిన్
గతవారంలోనే తొలిసారి 75 వేల డాలర్ల మార్కును తాకిన బిట్‌కాయింట్ రోజులవ్యవధిలోనే కొత్త మైలురాయిని చేరుకోనుండటం విశేషం.
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో క్రిప్టో మార్కెట్లో ఉత్సాహం పెరిగింది. డిజిటల్ ఆసులకు మద్దతుగా ట్రంప్ హామీ ఇవ్వడం, క్రిప్టో మార్కెట్ అనుకూల నిర్ణయాలను ప్రకటించడంతో తాజాగా ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయింట్ తొలిసారిగా 80,000 డాలర్లకు చేరువగా నిలిచింది. గతవారంలోనే తొలిసారి 75 వేల డాలర్ల మార్కును తాకిన బిట్‌కాయింట్ రోజులవ్యవధిలోనే కొత్త మైలురాయిని చేరుకోనుండటం విశేషం. ఆదివారం సింగపూర్ మార్కెట్లో బిట్‌కాయిన్ 4.3 శాతం మేర పెరిగి 79,771 డాలర్లకు చేరుకుంది. బిట్‌కాయిన్‌తో పాటు కార్డానో, డోజ్‌కాయిన్ వంటి చిన్న క్రిప్టోకరెన్సీలు సైతం ర్యాలీ చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాను క్రిప్టోకరెన్సీకి ప్రపంచ రాజధానిగా మార్చనున్నట్టు హామీ ఇచ్చారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయింట్ 90 శాతం పుంజుకుంది. డిమాండ్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఇందుకు సహాయపడింది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో క్రిప్టో అనుకూల అభ్యర్థి గెలుపొందడంతో ఈక్విటీ, బంగారం వంటి సాధనాల కంటే ఎక్కువ రాబడి క్రిప్టో ఇస్తుందనే అంచనాలు దీనికి మరింత మద్దతుగా నిలిచాయి.