తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రూ. 14.56 లక్షల కోట్ల రైటాఫ్ రుణాల రికవరీ!

గడిచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 14,56,226 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయని కేంద్రం వెల్లడించింది.

Update: 2023-08-07 14:06 GMT

న్యూఢిల్లీ: గడిచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 14,56,226 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయని కేంద్రం వెల్లడించింది. అందులో భారీ పరిశ్రమలు, సేవల సంస్థల రుణ మాఫీయే రూ. 7,40,968 కోట్లు ఉన్నాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు(ఎస్‌సీబీ) 2014, ఏప్రిల్ నుంచి 2023, మార్చి వరకు కార్పొరేట్ రుణాలతో సహా మొత్తం రూ. 2,04,668 కోట్ల రైటాఫ్ రుణాలను రికవరీ చేశాయని ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాడ్ అన్నారు.

సమీక్షించిన కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 0.84 లక్షల కోట్ల రైటాఫ్ రుణాలను రికవరీ చేశాయి. ఇది 2017-18లో రికవరీ చేసిన రూ. 1.18 లక్షల కోట్లు, 2021-22లో రికవరీ చేసిన రూ. 0.91 లక్షల కోట్ల కంటే తగ్గిందని మంత్రి తెలిపారు. అలాగే, 2022-23లో ప్రైవేట్ రంగ బ్యాంకులు చేసిన రైటాఫ్ చేసిన రుణాలు రూ. 73,803 కోట్లని ఆయన పేర్కొన్నారు.


Similar News