Banks: ఎఫ్‌వై24లో రూ.1.70 లక్షల కోట్ల రుణాలు మాఫీ.. రూ.46 వేల కోట్ల రికవరీ

బ్యాంక్ రుణాల మాఫీకి సంబంధించిన వెల్లడైన డేటా ప్రకారం, భారతదేశంలోని బ్యాంకులు మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రూ.1,70,270 కోట్ల రుణాలను మాఫీ చేశాయి.

Update: 2024-08-11 12:03 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంక్ రుణాల మాఫీకి సంబంధించి వెల్లడైన డేటా ప్రకారం, భారతదేశంలోని బ్యాంకులు మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రూ.1,70,270 కోట్ల రుణాలను మాఫీ చేశాయి. ఇది అంతకుముందు ఏడాది రూ.2,08,037 కోట్లుగా ఉంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్‌టిఐ) దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో ఆర్‌బీఐ అందించిన డేటాలో ఇది వెల్లడైంది. దేశంలో బ్యాంకులు గత ఐదేళ్లలో రూ. 9.90 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి. 2023-24లో బ్యాంకులు మొత్తం రూ. 46,036 కోట్ల రుణాలను రికవరీ చేయగలిగాయి, ఇది గత ఏడాది 45,551 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.

గత ఐదేళ్లలో మొత్తం రికవరీలు 18.70 శాతం మాత్రమే కాగా మొత్తం రూ.1,85,241 కోట్లుగా ఉన్నాయి. రుణాల రికవరీకి వివిధ చర్యలు తీసుకున్నప్పటికీ ఐదేళ్లలో రద్దు చేసిన రుణంలో 81.30 శాతం బ్యాంకులు రికవరీ చేయలేకపోయాయి. గత ఐదేళ్లలో బ్యాంకులు తమ నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏలు) లేదా డిఫాల్ట్ చేసిన రుణాలను రూ. 9,90,224 కోట్లుగా పేర్కొన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలు రద్దు చేయబడినప్పుడు, బ్యాంకు ఆస్తి నుంచి తొలగించినప్పుడు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News