రుణాలు, డిపాజిట్ల వృద్ధితో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రస్థానం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) రుణాలు, డిపాజిట్ వృద్ధితో అగ్రస్థానం సాధించింది.

Update: 2023-08-13 10:12 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) రుణాలు, డిపాజిట్ వృద్ధితో అగ్రస్థానం సాధించింది. సమీక్షించిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బీఓఎం డిపాజిట్, అడ్వాన్స్‌లు దాదాపు 25 శాతం పెరిగాయి. ఇది మిగిలిన బ్యాంకుల కంటే చాలా ఎక్కువ. ఇటీవల బ్యాంకులు వెలడించిన త్రైమాసిక ఫలితాల ఆధారంగా 24.98 శాతంతో లోన్లు భారీగా పెరిగాయి.

ఆ తర్వాత యూకో బ్యాంక్ 20.70 శాతం వృద్ధితో రెండోస్థానంలో నిలవగా, బ్యాంక్ ఆఫ్ బరోడా 16.80 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 16.21 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దిగ్గజ ఎస్‌బీఐ 15.08 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అయితే, ఎస్‌బీఐ మొత్తం రుణాలు దాదాపు 16 రెట్లు అధికంగా ఉన్నాయి. రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రుణాల విసహ్యంలో బీఓఎం అత్యధికంగా 25.44 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 19.64 శాతం, పంజాన్ నేషనల్ బ్యాంక్ 19.41 శాతం కలిగి ఉన్నాయి. డిపాజిట్లకు సంబంధిని బీఓఎం 15.50 శాతం వృద్ధిని సాధించగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13.66 శాతం పెరిగాయి.


Similar News