భారం కానున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు

రుణాల రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో రిటైల్ సహా ఇతర రుణాలు భారం కానున్నాయి.

Update: 2024-03-31 13:46 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) రుణాలు మరింత ప్రియం కానున్నాయి. రుణాల రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో రిటైల్ సహా ఇతర రుణాలు భారం కానున్నాయి. దీంతో బీఓఐ వడ్డీ రేట్లు 2.75 శాతం నుంచి 2.85 శాతానికి పెరిగింది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వ్స్తాయని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఏప్రిల్ 5న భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంకు రుణ రేట్లను పెంచడం గమనార్హం. మరో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ సైతం వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్న మరొక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. 

Tags:    

Similar News