Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం .. మహిళల కోసం ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు లాంచ్..!
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) అనుబంధ సంస్థ బీఓబీ కార్డ్ లిమిటెడ్(BOB Card Limited) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) అనుబంధ సంస్థ బీఓబీ కార్డ్ లిమిటెడ్(BOB Card Limited) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా సరికొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. తియారా క్రెడిట్ కార్డు(Tiara Credit Card) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. రూపే నెట్‌వర్క్(Rupay Network)పై ఈ క్రెడిట్ కార్డు పని చేయనుంది. ఈ కార్డు ద్వారా ట్రావెల్, డైనింగ్, లైఫ్ స్టైల్ కేటగిరీల్లో బెనిఫిట్స్ తో పాటుగా రివార్డు పాయింట్లు అందిస్తోంది. ప్రతీ త్రైమాసికంలో బుక్ మై షోలో మూవీ టికెట్ బుకింగ్ లపై రూ. 250 డిస్కౌంట్ లభిస్తుంది. ఏడాదికి మూడు నెలల పాటు స్విగ్గీ మెంబెర్ షిప్ ఇస్తారు.
ఇవే గాక మింత్రా, నైకా, ఫ్లిప్ కార్ట్ వోచర్లు ఫ్రీగా లభిస్తాయి. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ వాటి ఓటీటీ మెంబెర్ షిప్ కూడా ఇస్తున్నారు. అలాగే ట్రావెల్, డైనింగ్, ఇంటర్నేషనల్ కొనుగోళ్లపై ప్రతీ 100 రూపాయల ట్రాన్సాక్షన్ కు 15 రివార్డు పాయింట్లు లభిస్తాయి. కాగా ఈ కార్డు పొందాలంటే జాయినింగ్ ఫీజుగా రూ. 2,499+GST చెల్లించాల్సి ఉంటుంది. అలాగే యానువల్ ఫీజు సైతం అంతే మొత్తం కట్టాలి. కాగా యూజర్లు కార్డు పొందిన రెండు నెలల్లో రూ. 25,00,000 విలువైన ట్రాన్సాక్షన్లు చేస్తే జాయినింగ్ ఫీజు రిటర్న్ ఇస్తారు. ఏడాదిలో 2.50 లక్షలు ఖర్చు చేస్తే యానువల్ ఫీజు క్యాన్సల్ చేస్తారు.