ఆగస్టు-22: నేడు తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.
దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించి వీడియోగ దారులకు శుభవార్తను అందించాయి. రూ. 31 మేర తగ్గించి ఊరటనిచ్చారు. కానీ గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఈ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశ చెందుతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హామి ఇచ్చినట్లుగా రూ. 500 గ్యాస్ సిలిండర్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎప్పుడెప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారా అని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్: రూ. 966
వరంగల్: రూ. 974
విశాఖపట్నం: రూ. 912
విజయవాడ: రూ. 927
గుంటూరు: రూ. 944