అన్ని కార్ల ధరలు పెంచిన ఆడి ఇండియా
అన్ని కార్లపై 2 శాతం వరకు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ గురువారం ప్రకటనలో తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతో పాటు రవాణా వ్యయం పెరిగిన కారణంగా అన్ని కార్లపై 2 శాతం వరకు ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ గురువారం ప్రకటనలో తెలిపింది. పెంచిన ధరలు జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. వాహనాల తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చుల భారం వల్ల తప్పనిసరిగా కొంతవరకు వినియోగదారులపై భారం వేయాల్సి వస్తోందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాల్ చెప్పారు. అంతేకాకుండా కంపెనీ, డీలర్‌షిప్ భాగస్వాముల వృద్ధిని కొనసాగించేందుకు కార్ల ధరల్లో సవరణ అవసరమని భావించినట్టు ఆయన తెలిపారు. సాధ్యమైనంత వరకు వినియోగదారులపై తక్కువ భారం ఉండేలా ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.