bullet train: స్వదేశీ సాంకేతికతతో దేశంలో బుల్లెట్ రైళ్లు: మంత్రి అశ్విని వైష్ణవ్

దేశంలో స్వదేశీ సాంకేతికతతో బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేసేందుకు భారత్ కృషి చేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం అన్నారు

Update: 2024-07-31 09:42 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో స్వదేశీ సాంకేతికతతో బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేసేందుకు భారత్ కృషి చేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం అన్నారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన భారత్‌లో రైల్వే వ్యవస్థను ఆధునికరించడానికి కట్టుబడి ఉన్నాము. దీని కోసం కొత్త టెక్నాలజీలను డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్-ముంబై నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ఇది చాలా సంక్లిష్టమైనది, జపాన్ సహాయంతో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రెండు పశ్చిమ నగరాల మధ్య బుల్లెట్ రైలు మొత్తం 508 కి.మీ దూరం ఉంటుంది, ఇందులో 320 కి.మీ మేర పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.

గతంలో మహారాష్ట్ర భాగంలో పనులు మందగించగా, 2022లో బీజేపీ-శివసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుంజుకుందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ప్రస్తుతం బుల్లెట్ రైలును త్వరగా ప్రారంభించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 21 కి.మీ పొడవుతో భారతదేశపు మొదటి సముద్రగర్భ రైలు సొరంగం నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. ప్రారంభంలో, భారతదేశం విదేశాల నుండి బుల్లెట్ రైలు సాంకేతికతను పొందింది, అయితే ఇప్పుడు దేశంలో కూడా అనేక సాంకేతికతలు అభివృద్ధి చెందాయి. వాటి ద్వారా స్వదేశీ బుల్లెట్ రైలు వస్తుంది. స్వదేశీ సాంకేతికతతో బుల్లెట్ రైళ్లను పూర్తిగా అభివృద్ధి చేయడంతోపాటు ‘ఆత్మనిర్భర్’ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

Tags:    

Similar News