భారీ లాభాలతో ప్రశంసలు.. ఇదే మొట్టమొదటిసారి: SBI ఛైర్మన్

దేశంలో మొట్టమొదటిసారిగా ఏ కంపెనీ నమోదు చేయనటువంటి అత్యధిక లాభాలను దేశీయ దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా అన్నారు.

Update: 2022-11-26 11:54 GMT

ముంబై: దేశంలో మొట్టమొదటిసారిగా ఏ కంపెనీ నమోదు చేయనటువంటి అత్యధిక లాభాలను దేశీయ దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసిందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా అన్నారు. దీంతో బ్యాంక్ ఆర్థిక పనితీరు పట్ల పలువురు విశ్లేషకులు, బ్రోకింగ్ హౌస్‌లు ప్రశంసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌బీఐ ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో, ఎన్నడూ లేనంత లాభాలను ఆర్జించింది. మొత్తం నికర లాభం రూ. 13,265 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 74 శాతం ఎక్కువ.

భారత్ ఇప్పటికే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినందున, 2027 నాటికి, పరిమాణం పరంగా దేశం మూడవ అతిపెద్దదిగా ఉంటుందని, అలాగే, ఎస్‌బీఐ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాక్సీ అని ఖరా అన్నారు. భారత్‌లో 47 కోట్ల మంది కస్టమర్ల ప్రోత్సాహం ఉంది, మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల ఎంపికలను బట్టి ప్రతి ఇంటికి బ్యాంక్ సేవలు వెళ్లాల్సిన అవసరం ఉంది. కస్టమర్లకు ఇచ్చే సేవలను మెరుగుపర్చాలని అలాగే, ఎస్‌బీఐ నిరంతర సేవలు అందించడానికి డిజిటల్ మోడ్‌కు వెళ్తుంది, YONO వంటి యాప్ సులభమైన సేవలను అందించడంలో సహాయపడింది అని ఆయన అన్నారు.

Tags:    

Similar News