భారత్‌లో యాపిల్ సొంత రిటైల్ స్టోర్!

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు భారత్‌లో తన సొంత బ్రాండ్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది.

Update: 2023-04-05 17:01 GMT

ముంబై: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు భారత్‌లో తన సొంత బ్రాండ్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియాకు మద్దతిస్తూ, స్థానిక తయారీ పెంచే ప్రణాళికలో భాగంగా కంపెనీ ముంబైలో తన మొదటి స్టోర్‌ను ప్రారంభిస్తామని, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే తేదీపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్టు వెల్లడించింది. యాపిల్ తన మొదటి రిటైల్ స్టోర్‌ను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయనుంది.

ఇప్పటికే బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ లోగోను సరికొత్త ఐకానిక్ ఆర్డ్ కాలీపీలి ట్యాక్సీ ఆర్ట్‌తో రూపొందించారు. మొదటి స్టోర్‌ను ముంబైలోనూ, రెండవ స్టోర్‌ను ఢిల్లీలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. యాపిల్ బ్రాండ్‌కు దేశంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తమ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ స్టోర్ దోహదపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. మొదటి స్టోర్ ఈ నెలలోనే అందుబాటులోకి రానుందని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News