Iphone 16: ఏఐ టెక్నాలజీతో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేసిన యాపిల్
ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ విడుదల చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సిరీస్‌ను యాపిల్ లాంచి చేసింది. యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో యాపిల్ ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’ జరిగింది. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమైంది. ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ విడుదల చేసింది. సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లు ఉన్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ లాంటి భారీ మార్పులతో ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఏ18 చిప్ 6-కోర్ సీపీయూతో విడుదల కాగా, ఐఫోన్ 15 కంటే కొత్త ఫోన్ 30 శాతం వేగంగా పనితీరును కలిగి ఉండనుంది. త్వరలో ప్రీ-ఆర్డర్ చేసే సౌకర్యాన్ని ప్రారంభించనున్నారు. యాపిల్ అధికారిక స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ధరలకు సంబంధించి ఐఫోన్ 16 ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ. 67,000) ఉండనుంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ. 1,44,900 నుంచి ప్రారంభం కావొచ్చు.