యాంటీ-స్కిడ్ ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్స్ స్టార్ట్.. రూ.999 చెల్లిస్తే చాలు

యాంటీ-స్కిడ్ ఫీచర్‌‌తో ఏథర్ నుంచి Rizta(రిజ్టా) ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి రాబోతుంది

Update: 2024-03-31 14:17 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: యాంటీ-స్కిడ్ ఫీచర్‌‌తో ఏథర్ నుంచి Rizta(రిజ్టా) ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి రాబోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ముందస్తు బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ స్కూటర్ కావాలనుకునే వారు రూ.999 టోకెన్ చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు. స్కూటర్ దాదాపు రూ.1.20 లక్షల నుండి రూ. 1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో ఉంటుందని అంచనా. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 100-110 కి.మీ. ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో LED హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కలర్డ్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, నావిగేషన్, కాల్, SMS అలర్ట్‌లతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ మోడ్‌లు, OTA అప్‌డేట్, ఫాస్ట్ చార్జింగ్ మొదలైనవి ఉన్నాయి. సీటు క్రింద స్థలం ఎక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్ Ola S1X, Ola S1 Air, బజాజ్ చేతక్, TVS iQube వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.


Similar News