Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. Apple TV+, మ్యూజిక్‌‌కి యాక్సెస్

భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తాజాగా యాపిల్ కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకుంది.

Update: 2024-08-27 09:46 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తాజాగా యాపిల్ కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కస్టమర్‌లకు Apple TV+, Apple Music ను అందించే ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భాగస్వామ్యంలో భాగంగా, Airtel XStream కస్టమర్‌లు ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో భాగంగా Apple TV+ లో వచ్చే డ్రామా సిరీస్‌లు, కామెడీ షోలు, ఫీచర్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా ఇతర కంటెంట్‌ను చూడవచ్చు. అలాగే, యాపిల్ మ్యూజిక్‌కు యాక్సెస్ పొందవచ్చు. క్యూరేటెడ్ ప్లేజాబితాలు, ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలు, ఆపిల్ మ్యూజిక్ రేడియో వంటి ఫీచర్‌లతో పాటు భారతీయ, గ్లోబల్ మ్యూజిక్‌ను వినవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు ఈ ఏడాది చివర్లో భారతదేశంలోని ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ప్రకటించలేదు.

భారతీ ఎయిర్‌టెల్ ఉన్నతాధికారి అమిత్ త్రిపాఠి మాట్లాడుతూ, ఎయిర్‌టెల్ కస్టమర్లకు మెరుగైన అనుభవాలను అందించానికి, ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా యపిల్ కంటెంట్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్లాట్‌ఫామ్‌పై అందిస్తున్నామని చెప్పారు. మా యూజర్లు ఇకమీదట ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కంటెంట్, వినోదాన్ని పొందగలుగుతారని అన్నారు. యాపిల్ వైస్ ప్రెసిడెంట్ ఓలీవర్ మాట్లాడుతూ, భారతదేశంలోని ఎయిర్‌టెల్ కస్టమర్‌లు త్వరలో Apple TV+, Apple Musicలో అద్భుతమైన కంటెంట్‌ను ఆస్వాదించగలరు, దీనికి సంతోషిస్తున్నామని చెప్పారు.


Similar News