Airtel బిజినెస్ సీఈఓ బాధ్యతలకు అజయ్ రాజీనామా!

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ బిజినెస్ విభాగం సీఈఓ అజయ్ చిత్కారా తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు కంపెనీ వెల్లడించింది

Update: 2023-06-26 13:14 GMT

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ బిజినెస్ విభాగం సీఈఓ అజయ్ చిత్కారా తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ మరో రెండు నెలల వరకు ఆయన కొనసాగుతారని ఎయిర్‌టెల్ సొమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలోనే ఎయిర్‌టెల్ సంస్థ వ్యాపారాలను మూడు భాగాలుగా విభజించింది. వాటిలో ఎయిర్‌టెల్ అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలను వాణి వెంకటేష్, దేశీయ వ్యాపారాన్ని గణేష్ లక్ష్మీనారాయణన్, డేటా సెంటర్ల వ్యాపారం ఎన్ఎక్స్‌ట్రా బాధ్యతలను ఆశిష్ అరోరా కొనసాగిస్తారని కంపెనీ స్పష్టం చేసింది.

ఎయిర్‌టెల్ సంస్థలో 23 ఏళ్లుగా పనిచేస్తున్న అజయ్ చిత్కారా వ్యాపార విస్తరణకు సంబంధించిన వ్యవహారాల్లో కీలకమైన వ్యక్తి. ఎయిర్‌టెల్ వ్యాపారాలను సమర్థవంతంగా కొనసాగించడని భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ అన్నారు. ఎయిర్‌టెల్ వ్యాపార బాధ్యతలను తీసుకున్న ముగ్గురు కొత్తవాళ్లతో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.


Similar News