5000 మందిని నియమించుకోనున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఇండియా!

టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా భారీ నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది.

Update: 2023-02-24 11:48 GMT

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా భారీ నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఈ ఏడాది లోపు 5,000 మంది క్యాబిన్ క్రూ ట్రైనీలు, పైలట్‌లను నియమించుకోవాలని భావిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అందులో 4,200 మంది క్యాబిన్ క్రూ, 900 మంది పైలట్లను తీసుకుంటామని తెలిపింది.

ఈ నెలలో చేసిన గణనీయమైన విమానాల ఆర్డర్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో మరిన్ని విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం క్యాబిన్ క్రూ, పైలట్లు, నిర్వహణ ఇంజనీర్ల అవసరం ఉంటుందని ఎయిర్ఇండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ అన్నారు.

ఈ నెల మొదట్లో ఎయిర్ఇండియా సంస్థ విమానాల తయారీ కంపెనీలైన బోయింగ్, ఎయిర్‌బస్‌లతో భారీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా వృద్ధిలో భాగంగా రెండు కంపెనీల నుంచి మొత్తం 470 విమానాలను ఆర్డర్ చేసింది. ఈ మెగా డీల్‌లో భాగంగా పెద్ద ఎత్తున నియామకాలకు కంపెనీ సిద్ధమైంది.

Tags:    

Similar News