ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుతో 2 లక్షల ఉద్యోగాలు!

దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా భారీ సంఖ్యలో విమానాలను కొన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ విమానాల తయారీ సంస్థలు ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి కంపెనీ మొత్తం 470 ఫ్లైట్ల కోసం ఒప్పందం చేసుకుంది.

Update: 2023-02-19 13:30 GMT

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా భారీ సంఖ్యలో విమానాలను కొన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ విమానాల తయారీ సంస్థలు ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి కంపెనీ మొత్తం 470 ఫ్లైట్ల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ మెగా ఒప్పందం ద్వారా భారత్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగాను 2 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే 140 వరకు విమానాలను కలిగిన ఎయిర్ ఇండియా భవిష్యత్తులో కొనబోయే విమానాల నిర్వహణ, కార్యకలాపాల కోసం సిబ్బంది, ఉద్యోగులను తీసుకోవాల్సి ఉంటుంది.

విమానయాన రంగంలో అనుభవం ఉన్న మార్టిన్ కన్సల్టింగ్ సంస్థ సీఈఓ మార్క్ మార్టిన్ ప్రకారం, ఎయిర్ ఇండియా భారీ విమానాల కొనుగోలు ద్వారా ప్రత్యక్షంగా అంటే విమానయాన సంస్థ ద్వారా ఉపాధిని పొందే వారు. ఉదాహరణకు పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్, నాన్-టెక్నికల్ సిబ్బంది ఉంటారు. పరోక్షంగా కంపెనీకి వెలుపల విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, రవాణా, సర్వీసెస్, ఇతర సంబంధిత వ్యక్తులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

ఈ మొత్తంగా ఆధారంగా ఎయిర్ ఇండియా కొనే విమానాలతో దాదాపు 2,02,000 నుంచి 2,09,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు అనుభవం ఉన్న పైలట్లు, క్యాబిన్ క్రూ, మెయింటెనెన్స్ ఇంజనీర్లు సహా కీలక సిబ్బంది అవసరం ఉందని ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ వెల్లడించారు.

Tags:    

Similar News