మైక్రోసాఫ్ట్-ఓపెన్‌ఏఐ నుంచి AI సూపర్‌కంప్యూటర్.. రూ.8 లక్షల కోట్లతో డేటా సెంటర్

దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ రెండు కలిసి సంయుక్తంగా కృత్రిమ మేధస్సు సూపర్‌ కంప్యూటర్‌ను తీసుకురాబోతున్నాయి

Update: 2024-03-30 07:35 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ రెండు కలిసి సంయుక్తంగా కృత్రిమ మేధస్సు సూపర్‌ కంప్యూటర్‌ను తీసుకురాబోతున్నాయి. దీని పేరు ‘స్టార్‌గేట్’. ఇది 2028 నాటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని కోసం డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నాయి. అంచనా వ్యయం దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైగా($100 బిలియన్ల) ఉంటుంది. డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం రెండు సంస్థల మధ్య గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కృత్రిమ మేధస్సు సాంకేతిక వేగంగా విస్తరిస్తున్న తరుణంలో దీని స్వీకరణను మరింత వేగవంతం చేయడానికి ‘స్టార్‌గేట్’ AI సూపర్‌ కంప్యూటర్‌ను రూపొందించబోతున్నారు.

నివేదికల ప్రకారం, నిధులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఈ సూపర్ కంప్యూటర్ అమెరికాలో నెలకొల్పబడుతోంది. అయితే దీనికంటే ముందుగా మైక్రోసాఫ్ట్ చిన్న-స్థాయి సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది 2026 నాటికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌‌ను తయారుచేయడానికి AI చిప్‌లకు ముఖ్యమైన ప్రాధాన్యత ఏర్పడింది. Nvidia CEO జెన్సన్ హువాంగ్ ప్రకారం, ఈ చిప్‌లు $30,000 నుండి $40,000 వరకు ధరలను కలిగి ఉంటాయి.


Similar News