Adani: అంబానీ జియో సెంటర్‌కు పోటీగా అదానీ అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్‌

దీని వ్యయం సుమారు 2 బిలియన్ డాలర్లు(రూ. 16.87 వేల కోట్లు) కావడం గమనార్హం.

Update: 2024-11-20 18:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అదానీ గ్రూప్ భారీ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనునట్టు తెలుస్తోంది. ముంబైలో ఇప్పటికే అంబానీకి చెందిన అతిపెద్ద జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఉండగా, దీనికి పోటీగా అదానీ దీన్ని నిర్మించే పనిలో ఉన్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ముంబైలోనే అతిపెద్ద అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. దీని వ్యయం సుమారు 2 బిలియన్ డాలర్లు(రూ. 16.87 వేల కోట్లు) కావడం గమనార్హం. దీనికి సంబంధించి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంఎంఆర్‌డీఏ) నుంచి డిజైన్ ఆమోదం లభించింది. మరో రెండు నెలల్లో బ్లూప్రింట్ ఆమోదం లభించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కన్వెన్ష సెంటర్ 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 20,000 మందికి వసతి, 12 లక్షల చదరపు అడుగుల ఇండోర్, 3 లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా కాంప్లెక్స్‌లో 275 గదులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ముంబైలోనే అతిపెద్ద కన్వెన్ష సెంటర్ జియో వరల్డ్ మొత్తం వైశాల్యం 10 లక్షల చదరపు అడుగుల్లో ఉంది. 

Tags:    

Similar News