ఐటీ హార్డ్‌వేర్‌ పీఎల్‌ఐ పథకానికి 32 దరఖాస్తులు!

ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద ల్యాప్‌టాప్‌లు, పీసీల ఉత్పత్తికి అద్భుతమైన స్పందిన వచ్చిందని కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2023-08-30 16:17 GMT

న్యూఢిల్లీ: ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద ల్యాప్‌టాప్‌లు, పీసీల ఉత్పత్తికి అద్భుతమైన స్పందిన వచ్చిందని కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 32 దరఖాస్తులు వచ్చాయని, బుధవారం(ఆగష్టు 30)తో దరఖాస్తులకు గడువు ముగిసిందని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి, హార్డ్‌వేర్‌ పీఎల్ఐ పథకం కింద ల్యాప్‌టాప్‌లను తయారీ చేసేందుకు హెచ్‌పీ ఇండియా, డెల్, ఏసర్, లెనొవొ, థామ్సన్, ఇంకా ఇతర కంపెనీలు ఉన్నాయి.

సర్వర్ల తయారీకి హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ దరఖాస్తు చేసింది. ఐటీ హార్డ్‌వేర్‌ను దేశీయంగా తయారు చేయడానికి, రూ.17,000 కోట్లతో ప్రభుత్వం పీఎల్‌ఐ 2.0 పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆన్‌-ఇన్‌-ఒన్‌ పీసీలు, సర్వర్లు, అల్ట్రా-స్మాల్‌ ఫామ్‌ ఫ్యాక్టర్‌ డివైజెస్‌ తయారు చేయనున్నారు. ప్రభుత్వం రూ.3.35 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలని భావిస్తోంది. దీనివల్ల ప్రత్యక్షంగా 75 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు.


Similar News